పండుగ ఘర్షణలో సామాన్యులపై గ్రామ సర్పంచ్ భౌతిక దాడికి పాల్పడి ఇద్దరు వ్యక్తులను గాయపరిచిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం నరసింహులగూడెం ఆవాసం దుబ్బ తండాలో చోటుచేసుకుంది. తీజ్ పండుగ వేడుకల్లో డప్పు పగిలిన విషయంపై తనకు గ్రామ సర్పంచ్ గణేష్‌కు వాగ్వాదం జరిగిందని బాధితుడు జాటోత్ గణేష్ తెలిపారు.
ఇద్దరు వ్యక్తులపై భౌతికదాడికి పాల్పడిన గ్రామసర్పంచ్ - sarpanch
గ్రామసర్పంచ్ భౌతిక దాడికి పాల్పడి ఇద్దరు వ్యక్తులను గాయపరిచిన సంఘటన సూర్యాపేట జిల్లా దుబ్బ తండాలో జరిగింది. బాధితులు నాగారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
తాగిన మైకంలో ఉన్న సర్పంచ్ గణేష్ దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ విషయమై నాగారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి గ్రామానికి తిరిగి వెళ్తుండగా సర్పంచ్ తన అనుచరులతో కలిసి అడ్డగించి తన తమ్ముడైన జాటోత్ భాస్కర్‌ను గొడ్డలి, రాళ్లతో దాడి చేయడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. తమపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన సర్పంచ్ గణేష్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై సర్పంచ్‌ను వివరణ కోరగా.. తాను దాడికి పాల్పడలేదని జాటోత్ గణేష్, అతని కుటుంబ సభ్యులు అకారణంగా తననే దూషిస్తూ తన చుట్టూ తిరుగుతూ తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు.
ఇవీ చూడండి:రూ.2 లక్షల 57 వేల విలువైన గుట్కాను పట్టుకున్న పోలీసులు