తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా పోలుమళ్లలో జరిగింది. ఎడ్లను కడగడానికి చెరువు వద్దకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

farmer died after accidentally falling into the pond in suryapet district
ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి

By

Published : Jul 24, 2020, 8:49 PM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్లలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఎర్రబెల్లి వెంకటేశ్వర్లు (40) తన బురద పొలంలో గొర్రు కట్టి ఎడ్లను కడగటానికి సమీపంలోని ముత్యాలమ్మ చెరువులోకి వెళ్లగా... ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. గమనించిన ఇద్దరు వ్యక్తులు టవల్ అందించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు.

టవల్ అందకపోవడం వల్ల చెరువులో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలికి చేరుకొని చెరువులోకి దిగి గాలించగా.. గంట తర్వాత మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చిలువేరు భవాని లింగరాజు, ఎంపీటీసీ ఉమా మల్లారెడ్డి కోరారు.

ఇవీ చూడండి: విషాదం: కరెంట్​షాక్​ కొట్టి ఓ వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details