తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్​

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని.. నాటిన వాటిని విధిగా సంరక్షించాలని ఆయన సూచించారు.

collector vinay krishna reddy visited development works at chilukuru villages in suryapeta
గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్​

By

Published : Jul 7, 2020, 7:43 PM IST

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో జిల్లా పాలనధికారి వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మండలంలోని బేతవోలు, కొండాపురం, పోలేనిగూడెం గ్రామాల్లో ఆరో విడత నాటిన హరితహారం మొక్కలను ఆయన పరిశీలించారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.

వందశాతం హరితహారం మొక్కలు నాటి.. వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. పెండింగ్​లో ఉన్న శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులకు తక్షణమే స్థలాలు పరిశీలించి.. పనులు మొదలు పెట్టాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

ABOUT THE AUTHOR

...view details