పండిన పంటను కల్లాల్లోనే అమ్ముకునే రైతులు... ఎక్కడికోపోయి అమ్ముకోగలరా అని కేంద్రాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం నల్ల చట్టాలు తీసుకు వచ్చారని నిలదీశారు. సూర్యపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని రైతులతో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి భట్టి విక్రమార్క పొలం బాట పోరు బాట రైతులతో ముఖాముఖీ నిర్వహించారు.
బానిసలుగా చేసేందుకే..
రైతులను ఆదానీ, అంబానిలకు బానిసలుగా చేసేందుకే కేంద్రం నల్ల చట్టాలు తెచ్చిందని కేంద్రన్ని భట్టి విమర్శించారు. మిడ్మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్, కాకతీయ కాలువలు నిర్మించింది, నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తెరాస చేసినట్టు డప్పుకొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు.