అమాయకపు మహిళలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న చల్ల నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని.. వాటిని వెలికి తీస్తానని నమ్మించేవాడు. వైరా పట్టణంలోని పాత ఇనుప సామాను షాపు నుంచి ఇత్తడిని కొనుగోలు చేసి, చిన్న చిన్న బిళ్లలు తయారుచేసేవాడు. ఇంట్లో పూజ చేస్తున్నట్టుగా నటించి తయారు చేసిన నకిలీ బిళ్లలు వారికి ఇచ్చేవాడు. ఇలా ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు చెప్పి మోసం చేసేవాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా మోసగాడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
గుప్త నిధుల పేరిట మోసం - suryapet police
గుప్తనిధుల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి రూ.రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
గుప్త నిథుల పేరిట మోసం.