సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో దొంగతనం జరిగింది. కనకయ్య కుటుంబం ఇంటికి తాళం వేసి తన బంధువుల గ్రామమైన రాంసాగర్కు వెళ్ళారు. తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తెరిచి దుస్తులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. ఇందతా చూడగా... దొంగలు పడినట్లు అర్థమైంది. మొత్తం పరిశీలించగా... ఇంట్లోని బంగారు, నగదు కన్పించలేదు. 5 తులాల బంగారం, 90 తులాల వెండి, రూ. 25 వేల నగదు పోయినట్లు బాధితుడు తెలిపాడు.
ఊరికి వెళ్లొచ్చేసరికే ఇంటిని దోచేశారు!
ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. మరుసటి రోజు తిరిగి వచ్చి చూసేసరికి... ఇల్లు గుల్లైంది. నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో జరిగింది.
ఊరికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల చేసిన దొంగలు
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.... ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.