రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేటలో నిర్మిస్తున్న కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైకోర్టు ప్రాజెక్టు పనులు ఆపమని చెప్పినా... సర్కారు పెడ చెవిన పెట్టిందని విమర్శించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'సాగు నీటి ప్రాజెక్టులకు మేం వ్యతిరేకం కాదు' - పొన్నం ప్రభాకర్
సాగు నీటి ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.
పొన్నం ప్రభాకర్