తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాస్​ అవ్వడం కోసం కాదు  ఉన్నతంగా ఎదిగేందుకు చదవాలి' - తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు

పరీక్షల సమయంలో విద్యార్థులు టీవీ, సెల్​ఫోన్లు దూరం పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.

telangana state finance minister harish rao visit to bajjanki
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు బెజ్జంకి పర్యటన

By

Published : Dec 20, 2019, 9:35 AM IST

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు బెజ్జంకి పర్యటన

విద్యార్థులు కేవలం పాస్​ అవ్వడం కోసం కాదు.. ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్షతో చదవాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో పర్యటించిన హరీశ్​.. ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.

విద్యార్థులు కళాశాలకు రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్​ చేయాలని వందశాతం హాజరు ఉండేలా చూసుకోవాలని అధ్యాపకులను మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్​ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నా... తన దృష్టికి తీసుకురావాలని అధ్యాపకులను హరీశ్​ కోరారు. ఈ ఏడాది కచ్చితంగా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details