తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారంతో పల్లెలు పచ్చబడాలి: కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ మండలం తీగూల్​ గ్రామంలో జిల్లా పాలనాధికారి వెంకట్రామిరెడ్డి పర్యటించారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన పనులపై అధికారులను కలెక్టర్​ ఆరా తీశారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న హరితహారంపై గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

siddipet district collector visit teegul village in siddipet district
'పచ్చదనం పెంచేలా హరితహారాన్ని చేపట్టాలి'

By

Published : Jun 23, 2020, 3:58 PM IST

పల్లె ప్రగతిలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని జగదేవ్​పూర్ మండలం తీగూల్​లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పర్యటించారు. గ్రామంలోని డంప్​ యార్డు, వైకుంఠధామం, గ్రామ నర్సరీలను సందర్శించి పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. వచ్చే నెల 6వ తేదీన తీగుల్ గ్రామ డంప్ యార్డులో సమావేశం జరపాలని, అప్పటిలోపు డంప్ యార్డును వినియోగంలోకి తేవాలని ఏంపీడీవోను కలెక్టర్ ఆదేశించారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో చేపట్టిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న హరితహారంపై గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

2017-18 సంవత్సరంలో ఎవెన్యూ ప్లాంటేషన్​లో భాగంగా తీగూల్ గ్రామంలో నాటిన మొక్కలు 70 శాతం బతికి ఉన్నాయని, గ్రామస్థుల కృషి, అధికారుల సమన్వయంతో చెట్లు ఏపుగా పెరిగాయని కలెక్టర్​ అన్నారు. వీటి తరహాలోనే అన్నీ గ్రామాలు ఇదే స్ఫూర్తితో చెట్లు పెంచాలని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పచ్చదనం పెంపు దిశగా స్పష్టమైన మార్పు కనిపించేలా ఆరో విడత హరితహారాన్ని చేపట్టాలని అధికారులకు జిల్లా పాలనాధికారి సూచించారు. ఇటీవల కలెక్టర్లతో సమావేశం సందర్భంగా అన్ని జిల్లాలకు, పట్టణ ప్రాంతాలకు హరితహారంపై ముఖ్యమంత్రి మార్గనిర్ధేశం చేశారని, ఆ మేరకు జిల్లాలో పట్టణాలు, గ్రామాల వారీగా హరితహారం లక్ష్యాలు కూడా పెరిగాయని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:'జూన్ నెల నుంచి పూర్తి జీతాలు, పింఛన్లు'

ABOUT THE AUTHOR

...view details