తెలంగాణ

telangana

ETV Bharat / state

సరకులు పంచి ఎస్సీ ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​​ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​లోని ఆశాజ్యోతి కేంద్రంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అక్కడ ఉన్న ఎయిడ్స్​ బాధిత చిన్నారుల కోసం 30 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

sc st commission chairman errolla srinivas birthday celebrations in siddipet district
ఆశాజ్యోతి కేంద్రంలో ఎర్రోళ్ల శ్రీనివాస్​ జన్మదిన వేడుకలు

By

Published : May 5, 2020, 10:38 PM IST

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​లోని ఆశాజ్యోతి కేంద్రంలో నిరాడంబరంగా జరుపుకున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోసం 30 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను నిర్వాహకులకు అందజేశారు. ఎయిడ్స్ బాధిత చిన్నారులను చేరదీసి ఆశ్రయం కల్పించి వారి ఆయుష్షు పెరిగే విధంగా కృషి చేస్తున్న సంస్థలను ఆయన అభినందించారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణతో ప్రజలంతా క్రమశిక్షణను అలవర్చుకున్నారని అన్నారు. ఇది అలవాటుగా మారితే ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారన్నారు. అనంతరం గజ్వేల్ మండలానికి చెందిన పలువురు తెరాస నాయకులు ఆయనకు పూల మొక్కలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఇవీ చూడండి: సీఎంఆర్​ఎఫ్​కు భారత్​ బయోటెక్​ భారీ విరాళం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details