సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆందోళన చేశారు. స్కాలర్షిప్ రాకపోవడంతో ఉన్నత విద్యకు వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మూలంగా పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఉపకారవేతన బకాయిలు విడుదల చేయండి' - స్కాలర్షిప్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
'ఉపకారవేతన బకాయిలని విడుదల చేయండి'