తెలంగాణ

telangana

ETV Bharat / state

'గజ్వేల్​లో రంజాన్ కానుకగా దుస్తుల పంపీణీ'

రంజాన్ కానుకగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక దుస్తులను పంపీణీ చేశారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. రంజాన్ పండుగ సందర్భంగా  ఈ కానుకలను అందిస్తున్నట్లు గజ్వేల్ ఆర్డీఓ స్పష్టం చేశారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో దుస్తుల పంపిణీ

By

Published : Jun 2, 2019, 5:10 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రంజాన్ కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 1300 మందికి, రెవెన్యూ డివిజన్ పరిధిలో 3500 మంది లబ్ధిదారులకు ఈ కానుకలను అందిస్తున్నట్లు ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ అభివృద్ధి సంస్థ అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ భాస్కర్, కమిషనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం దుస్తుల కానుక

ABOUT THE AUTHOR

...view details