తెలంగాణ

telangana

ETV Bharat / state

"నియామకాలు చేపట్టే వరకు పోరాటం ఆగదు"

సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా పాఠశాలలను బలోపేతం చేయిస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

నియామకాలు చేపట్టేవరకు పోరాటం ఆగదు

By

Published : May 16, 2019, 5:03 PM IST

నియామకాలు చేపట్టేవరకు పోరాటం ఆగదు

సిద్దిపేటలోని ముస్తాబాద్​ చౌరస్తాలో టీఆర్టీ-2017 అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయ నియామకాలపై ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు తప్ప ఉద్యోగాలు కల్పించడం లేదని టీపీటీఎఫ్​ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details