సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ తొలి మహిళ ఛైర్ పర్సన్‌గా ఆకుల రజిత బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ ఛైర్మన్, ఇతర కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలిసి సమన్వయంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు.
'హుస్నాబాద్ పట్టణ అభివృద్దికి కృషి చేస్తా'
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఆకుల రజిత బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ హాజరయ్యారు.
'హుస్నాబాద్ పట్టణ అభివృద్దికి కృషి చేస్తా'
ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత వరకే పార్టీలు కానీ గెలిచిన తర్వాత అభివృద్ధి పార్టీగా ముందుకు వెళ్లాలని కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలో మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఎకరంన్నర స్థలం ఇస్తే తాము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. పాలకవర్గ సభ్యులందరు సమన్వయంతో పనిచేసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సతీశ్‌కుమార్ పేర్కొన్నారు.
TAGGED:
సిద్ధిపేట తాజా వార్త