తెలంగాణ

telangana

ETV Bharat / state

మన తరుపున మాట్లాడేవారే లేరు: రేవంత్​రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి మిరుదొడ్డి మండలం కూడవెల్లి, ఖాజీపూర్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థితో కలిసి పాల్గొన్నారు. ఈసారి సమస్యలపై ప్రశ్నించే వ్యక్తిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మీ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తా.. ఆ బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

mp-revanth-reddy-participate-dubbaka-election-campaign
మన తరుపున మట్లాడేవారే లేరు: రేవంత్​రెడ్డి

By

Published : Oct 29, 2020, 7:47 PM IST

Updated : Oct 29, 2020, 8:51 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు. మిరుదొడ్డి మండలం కూడవెల్లి, ఖాజీపూర్​లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తెరాస ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అవుతుందన్నారు. అల్లుడు, మంత్రి, కొడుకులు పదవులు తెచ్చుకున్నారు.. కానీ పేదల కోసం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, మూడు వేల నిరుద్యోగ భృతి, ఆరోగ్యశ్రీ పథకం ఇలా ఎన్నో హామీల్లో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవేర్చనిది కేసీఆర్ ప్రభుత్వం అని ఆరోపించారు.

మొదటిసారిగా 63 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. రెండోసారి 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఈసారి సమస్యలపై మాట్లాడే వ్యక్తిని గెలిపించాలని రేవంత్​ కోరారు. రామలింగారెడ్డిని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. ముత్యం రెడ్డిని గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే మీ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తా.. ఆ బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:కేంద్ర బలగాలతో దుబ్బాక ఎన్నికలు నిర్వహించాలి: కోమటిరెడ్డి

Last Updated : Oct 29, 2020, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details