తెలంగాణ

telangana

ETV Bharat / state

అందుబాటులోకి లిక్విడ్​ ఆక్సిజన్ ట్యాంక్​.. ప్రారంభించిన హరీశ్​

సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ అందుబాటులోకి వచ్చింది. రూ. 61 లక్షలతో.. 405 పడకలకు ఏర్పాటు చేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్​ను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. కరోనా సోకినవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా.. సిద్దిపేటలో చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

అందుబాటులోకి లిక్విడ్​ ఆక్సిజన్​.. ప్రారంభించిన హరీశ్​
అందుబాటులోకి లిక్విడ్​ ఆక్సిజన్​.. ప్రారంభించిన హరీశ్​

By

Published : Sep 29, 2020, 5:55 AM IST

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగాయని, శాశ్వత ప్రాతిపదికన సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో ఆక్సిజన్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్తే.. మార్గమధ్యలో అనేక ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఇకపై అలాంటి సమస్య ఉండదని హామీ ఇచ్చారు. మెడికల్ కళాశాలలో రూ.61లక్షలతో ఏర్పాటు చేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకును హరీశ్‌రావు ప్రారంభించారు.

ఐసీయూలో 45, జనరల్ వార్డుల్లో 360 పడకలకు ఆక్సిజన్‌ సరఫరా ఉంటుందని తెలిపారు. కరోనా సోకినవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా.. సిద్దిపేటలోనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.

అందుబాటులోకి లిక్విడ్​ ఆక్సిజన్ ట్యాంక్​.. ప్రారంభించిన హరీశ్​

ఇవీ చూడండి:ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details