సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18వ వార్డులో చేనేత కార్మికుడు మెతుకు ఆంజనేయులు కుటుంబం నివాసముంటోంది. దివ్యాంగుడైన ఆంజనేయులు ఎంఏ బీఎడ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించేవాడు. కరోనా మహమ్మారి వల్ల ఆరు నెలలుగా విద్యాసంస్థలన్నీ మూతపడటం వల్ల ఉపాధి కోల్పోయిన ఆంజనేయులు కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నాడు.
ఓ వైపు కరోనా మహమ్మారి ... మరోవైపు ప్రకృతి కన్నెర్ర
కరోనా మహమ్మారి వల్ల జీవనోపాధి కోల్పోయి కుటుంబ పోషణే భారమైన ఆ వ్యక్తిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు ఉన్న ఇల్లు కాస్త నేలమట్టమైంది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో పాలుపోక సాయం కోసం వేచిచూస్తున్నాడు ఆ కుటుంబ యజమాని.
ఓ వైపు కరోనా మహమ్మారి ... మరోవైపు ప్రకృతి కన్నెర్ర
వారం రోజుల నుంచి కురుస్తున్న వానతో ఉన్న పెంకుటిల్లు కాస్త నేలమట్టమైంది. కరోనాతో ఉపాధి కోల్పోయి ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటున్నామని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు కుటుంబాన్ని పోషించడమే భారమైన ఈ తరుణంలో ప్రకృతి పగబట్టినట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ఉన్న ఇల్లు కాస్త నేలమట్టమయిందని వాపోయారు. ప్రభుత్వం, దాతలు సహకరించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.