సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో పది రెండు పడక గదుల నూతన గృహాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.
రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ - Harish Rao
సిద్దిపేట జిల్లా సీతారాంపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సంబంధిత ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్
గ్రామంలో పెంకుటిల్లు కనబడకుండా ఊరును మొత్తం డబుల్ బెడ్రూం గ్రామంగా తయారు చేద్దామని... అతి త్వరలో నిర్మాణానికి శ్రీకారం చుడతామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గ్రామస్థులు ఎంత త్వరగా ఖాళీ చేస్తే అంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు.
ఇవీ చూడండి: ఈనాడు సాయం.. మాన్పింది గాయం...