తెలంగాణ

telangana

ETV Bharat / state

'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది కేసీఆర్​ లక్ష్యం' - సీఎంఆర్ఎఫ్ చెక్కులు

సిద్దిపేట నియోజకవర్గంలోని 22 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేది కేసీఆర్​ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది కేసీఆర్​ లక్ష్యం'

By

Published : Oct 22, 2019, 8:24 PM IST

'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది కేసీఆర్​ లక్ష్యం'
కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో పలు మండలాల్లోని 22 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఎవరైనా కార్పొరేటు ఆస్పత్రిలో చికిత్స పొందితే వారు సీఎం రిలీఫ్ ఫండ్​కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని హరీశ్​ రావు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details