తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు బహుమతులు అందజేసిన హరీశ్​ - విద్యార్థులకు బహుమతులు అందజేసిన హరీష్​

పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే హరీశ్​ రావు ప్రోత్సాహక బహుమతి అందజేశారు.

విద్యార్థులకు బహుమతులు అందజేసిన హరీష్​

By

Published : Jun 23, 2019, 12:23 AM IST

సిద్దిపేటలో పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన 46 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్నారై సహకారంతో ప్రోత్సాహకంగా ఒక్కో విద్యార్థికి 25 వేల రూపాయల నగదు బహుమతి ఎమ్మెల్యే హరీశ్​ రావు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, రఘోత్తమరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, విద్యాధికారులు పాల్గొన్నారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు హరీశ్​ రావు శుభాభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతాలు సాధించడం శుభపరిణామమని అన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందజేసిన హరీష్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details