తెలంగాణ

telangana

ETV Bharat / state

100 పాఠశాలలను ఆ రోజే ప్రారంభిస్తాం: మంత్రి హరీశ్​​ రావు

Minister Harish Rao comments: సిద్దిపేట జిల్లాలో ఆర్థిక మంత్రి హరీశ్​​ రావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. డీఏపీ ఎరువు ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశమిచ్చారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు పెంచేలా కృషి చేయాలని చెప్పారు. జనవరి రెండో తేదీన 100 పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

Finance Minister Harish Rao press meet in Siddipet district
హరీష్​రావు మీడియా సమావేశం

By

Published : Dec 20, 2022, 10:34 PM IST

Minister Harish Rao comments: రాష్ట్రంలో ఈజీఎస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల డబ్బులు 150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నదని కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి దుయ్యబట్టారు. జిల్లా కేంద్రమైన రెడ్డి సంక్షేమ సంఘంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, అన్నీ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

అధికారులకు సూచనలు: ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో వానాకాలంలో వరిసాగు 5 లక్షల 27వేలు, యాసంగి వరిసాగు 2 లక్షల 90 వేల లక్ష్యం గజ్వేల్ రేక్ పాయింట్ ఉన్న దృష్ట్యా ఎరువుల విషయంలో అధికారులు జాగ్రతలు పాటించాలని మంత్రి హరీశ్ రావు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎరువులు దొరకక లైనులో నిల్చుని 7 మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. డీఏపీ ఎరువు ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికార వర్గానికి ఆదేశమిచ్చారు.

ఆయిల్ ఫామ్ సాగు పెంచేలా కృషి చేయాలి: వచ్చే నెల నుంచి బోరు బావుల్లో వరి పంటకు నీరు కొరత ఏర్పడుతున్న దృష్ట్యా ముందస్తు మల్లన్న సాగర్ 15 టీఎంసీ, రంగనాయక సాగర్ లో 3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని వెల్లడిచారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు పెంచేలా కృషి చేయాలని, అవసరమైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో క్షేత్ర సందర్శన చేయాలని దిశా నిర్దేశించారు. జిల్లాలో 7 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు పూర్తి అయిందని, రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం అని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ఎకరానికి లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తున్నదని తెలిపారు.

100 పాఠశాలలు ప్రారంభిస్తాం:జనవరి రెండో తేదీన మనఊరు-మనబడిలో భాగంగా పనులు పూర్తి అయిన 100 పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. గతేడాది పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం కూడా సిద్దిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని, ఫలితాల్లో ఏ మాత్రం తగ్గినా ఉపేక్షించేది లేదని అధికారును హెచ్చరించారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details