Drunken Teacher: విద్యార్థులకు తప్పొప్పులు నేర్పి ఉన్నతమార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. విచక్షణ మరిచి ప్రవర్తించాడు. దేవాలయంలాంటి విద్యాలయంలోనే మద్యం సేవించాడు. అంతటితో ఆగాడా అంటే.. మైకంలో విద్యార్థులను ఇష్టారీతిన చితకబాదాడు కూడా. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
సగం తాగి కిటికీలో పెట్టి మందు గ్లాసు.. మత్తులో చిన్నారులని కూడా చూడకుండా..
ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తోన్న ఉపాధ్యాయుడు మహిపాల్‌రెడ్డి గురువారం(ఫిబ్రవరి 10న) స్కూల్లోనే మద్యం సేవించాడు. మత్తులో చిన్నారులని కూడా చూడకుండా విద్యార్థులను కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ దెబ్బలకు చిన్నపిల్లల చర్మం కమిలిపోయి వాతలు ఏర్పడ్డాయి. ఇంటికి వెళ్లిన విద్యార్థుల శరీరాలపై వాతలను గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిందంతా చెప్పారు.
నమ్మి పంపిస్తే ఇలా చేస్తారా..?
కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు ఈరోజు పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. ప్రైవేట్ స్కూళ్లను కాదని ప్రభుత్వ పాఠశాలలను నమ్మి తమ పిల్లలను పంపిస్తే.. ఇలా కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ఉపాధ్యాయుడై ఉండి పాఠశాలలోనే మద్యం సేవించడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాలలో ఏది జరిగిన తల్లిదండ్రులకు తెలపకూడదని విద్యార్థులను ఉపాధ్యాయులు బెదిరిస్తున్నట్లు.. మధ్యాహ్న భోజన కార్మికురాలు వివరించింది. ఈ విషయం విన్నాక తల్లిదండ్రులు మరింత ఆగ్రహంతో ఆందోళన చేశారు.
చిన్నారి వీపుపై వాతలు చూపిస్తోన్న తల్లి విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయుడు మహిపాల్‌రెడ్డి సెలవులో ఉన్నాడని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి.. తగు చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: