తెలంగాణ

telangana

ETV Bharat / state

​​​​​​​ భాజపా, తెరాసలది.. 'దిల్లీలో దోస్తీ-రాష్ట్రంలో కుస్తీ' వైఖరి - cpi state secretary

భాజపా, తెరాసల వైఖరి దిల్లీలో దోస్తీ... రాష్ట్రంలో కుస్తీ అన్న చందంగా తయారైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి విమర్శించారు. సెప్టెంబర్​ 11 నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

​​​​​​​ భాజపా, తెరాసలది.. 'దిల్లీలో దోస్తీ-రాష్ట్రంలో కుస్తీ' వైఖరి

By

Published : Aug 26, 2019, 7:50 PM IST

​​​​​​​ భాజపా, తెరాసలది.. 'దిల్లీలో దోస్తీ-రాష్ట్రంలో కుస్తీ' వైఖరి

చరిత్రను వక్రీకరిస్తే కేసీఆర్​ చరిత్ర హీనులుగా మిగిలిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్​ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో అక్రమాలు జరిగితే చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కానీ,.. వీఆర్వో, వీఆర్​ఏలను రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. జమ్ము కశ్మీర్​లో కర్ఫ్యూ వాతావరణంపై స్పందించిన చాడ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా, తెరాసలు దిల్లీలో దోస్తులుగా వ్యవహరిస్తూ.. రాష్ట్రంలో మాత్రం విమర్శించుకుంటున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details