సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేటలోని పదో వార్డు కౌన్సిలర్ కే. బంగారయ్య... కేబీఆర్ సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇటీవల మృతి చెందిన విలేకరి నక్క మల్లికార్జున్ జ్ఞాపకార్థం 32 మంది పేద కుటుంబాలకు వస్తువులు అందజేశారు.
నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ - lock down update
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేటలోని పదో వార్డు కౌన్సిలర్... నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.
నిరుపేదలకు కౌన్సిలర్ నిత్యవసర వస్తువుల పంపిణీ
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని.... భౌతికదూరం పాటించాలని బంగారయ్య కోరారు. వైరస్ నియంత్రణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.