తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో కారును ముంచిన చపాతి రోలర్‌

ఎన్నికల్లో ఒక గుర్తు మరో గర్తును పోలి ఉండడం వల్ల ఓటర్లు తికమక పడే ఛాన్స్​ ఉంది. ఒక గుర్తుకు ఓటు వేయబోయి మరో గుర్తుకు వేసే అవకాశమూ ఉంది. ఇదే దుబ్బాక ఉపఎన్నికలో జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కారు గుర్తును పోలిన చపాతి రోలర్‌ గుర్తుకు 3,570 ఓట్ల రావడానికి ఇదే కారణమంటున్నారు.

Chapati Roller got 3,570 votes in dubbaka by election
కారు గుర్తును ముంచిన చపాతి రోలర్‌

By

Published : Nov 11, 2020, 8:11 AM IST

Updated : Nov 11, 2020, 8:37 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో చపాతి రోలర్‌ గుర్తుకు 3,570 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పార్టీలైన భాజపా, తెరాస, కాంగ్రెస్‌ తరువాత అత్యధిక ఓట్లు ఈ గుర్తుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజు సాధించడం విశేషం. చపాతీ రోలర్‌, కారును పోలి ఉండటం వల్లే ఆ అభ్యర్థికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఎన్నికలో శ్రమజీవి పార్టీ తరఫున బరిలో నిలిచిన జాజుల భాస్కర్‌కు 1,991, స్వతంత్ర అభ్యర్థులు కంటె సాయన్న-1,709, శ్యాంకుమార్‌-1,442, లక్ష్మణ్‌రావు-1,221, మోతె నరేశ్‌కు 1006 ఓట్లు పోలయ్యాయి. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున పోటీ చేసిన ఎస్‌.అశోక్‌కు అతి తక్కువగా 97 ఓట్లు వచ్చాయి.

ఇదీ చదవండి:భాజపా గెలుపుతో కాంగ్రెస్ నేతల్లో ‌ఆందోళన..

Last Updated : Nov 11, 2020, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details