సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాజపా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దౌల్తాబాద్ మండలంలోని పలుగ్రామాల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పర్యటించారు. తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ సహా పలువురు రఘునందన్ రావు సమక్షంలో భాజపాలో చేరారు.
'మంత్రి హరీశ్, ఎంపీ ప్రభాకర్.. నా సవాల్‌కు సిద్ధమా?' - bjp campaign in dubbaka
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో మోటార్లకు మీటర్లు బిగించాలనే అంశం ఉంటే ప్రజలు వేసే ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు.
'మంత్రి హరీశ్, ఎంపీ ప్రభాకర్.. నా సవాల్‌కు సిద్ధమా?'
దుబ్బాక ఉపఎన్నికలో భాజపాను గెలిపించాలని కోరుతూ రఘునందన్ రావు ఓటర్లను అభ్యర్థించారు. పార్లమెంట్లో ఆమోదింటిన వ్యవసాయ బిల్లుల్లో మోటార్లకు మీటర్లు పెట్టాలనే అంశం ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. ఒకవేళ ఆ అంశం బిల్లుల్లో లేకుంటే.. మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు.