దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఆయా పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత తన స్వగ్రామమైన కుటుంబసభ్యులతో కలిసి చిట్టాపూర్‌లో ఓటేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని సుజాత ధీమా వ్యక్తం చేశారు.
చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్... తుక్కాపూర్‌లో శ్రీనివాస్‌రెడ్డి
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్‌రావు
తోగుట మండలం తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భాజపా అభ్యర్థి రఘునందన్ రావు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన బొప్పాపూర్‌లో పోలింగ్ స్టేషన్ నంబర్ 17లో ఓటు వేశారు. ఈ ఉపఎన్నికలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రఘునందన్‌రావు నియోజకవర్గ ఓటర్లను వేడుకున్నారు.
ఇదీ చూడండి: దుబ్బాక ఎన్నిక వేళ సిద్దిపేటలో మరోసారి ఉద్రిక్తత
Last Updated : Nov 3, 2020, 10:38 AM IST