తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు గంజాయి.. ఇద్దరు అరెస్ట్​

కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయిని, ఒక ద్వి చక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Two people arrested for selling marijuana for collage students in sangareddy patancheru
విద్యార్థులకు గంజాయి.. ఇద్దరు అరెస్ట్​

By

Published : Mar 12, 2020, 10:24 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగి గ్రామ డిఫెన్స్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్నారని ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులకు సమాచారం అందింది. దానితో​ సీఐ వేణుకుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వారు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన అరవింద్ ముఖియా, ఆంధ్రప్రదేశ్​ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి చెందిన సనసాయిధన అనే ఇద్దరు యువకులు పట్టుబడ్డారు.

వీరిని విచారించగా పటాన్​చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో నివాసముంటూ కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 150 గ్రాముల ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు.

విద్యార్థులకు గంజాయి.. ఇద్దరు అరెస్ట్​

ఇదీ చూడండి:తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details