సంగారెడ్డి పటాన్చెరు గణపతిగూడెంలో శవపేటికలో పెట్టి ఖననం చేసిన మల్లమ్మ అనే మహిళ మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బయటకు తీసి గుండు గీశారు. అనారోగ్యంతో ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరి... చికిత్స పొందుతూ మరణించిన మల్లమ్మను వారి సంప్రదాయం ప్రకారం పెట్టెలో పెట్టి ఖననం చేశారు.
ఖననం చేసిన మహిళ మృతదేహాన్ని వెలికితీసి గుండు గీశారు!
శవపేటికలో పెట్టి ఖననం చేసిన ఓ మహిళ మృతదేహానికి గుర్తు తెలియని వ్యక్తులు గుండు గీసిన ఘటన పటాన్చెరు పీఎస్ పరిధిలో జరిగింది. దీనిపై మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Tonsure to dead body
మూడోరోజు కార్యక్రమం చేద్దామని కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వెళ్లగా... మృతదేహం ఉన్నచోట తవ్వినట్లు కనిపించింది. తల్లి శవాన్ని ఎవరైనా తీశారా!... ఉందా! అనే సందేహంతో కుమారుడు రాజు పెట్టె తెరచి చూడగా... ఆమె తలకు గుండు గీసి ఉంది. దీనిపై అతను పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా అనుమానితులు