తెలంగాణ

telangana

ETV Bharat / state

మెులకెత్తని సోయా.. ఆందోళనకు గురవుతున్న రైతన్న.. - sangareddy district news

ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాలు నాణ్యతతో ఉంటాయనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో ప్రభుత్వం రాయితీపై అందజేసిన విత్తనాలు మెులకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

subsidized soya seeds did not sprout in sangareddy district
మెులకెత్తని సోయా.. ఆందోళనకు గురవుతున్న రైతన్న..

By

Published : Jun 23, 2020, 1:03 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన రాయితీ సోయా విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మొక్కజొన్నకు బదులు సోయా సాగు చేయాలని అధికారులు చెబితే విని తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

ప్రభుత్వం రాయితీపై మండలంలోని వివిధ గ్రామాల్లో 7 వేల బస్తాల సోయా విత్తనాలు పంపిణీ చేసింది. దాదాపు సగానికి పైగా రైతుల వద్ద అవి మొలకెత్తలేదు. నాణ్యమైన విత్తనాలు కాకపోవటం వల్ల పొలంలోనే మొలకెత్తకుండా మురిగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details