సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వర్షాలు అధికంగా కురవడం వల్ల ఇసుకాసురులు ధరలను అమాంతం పెంచేశారు. దీనివల్ల ఇల్లు నిర్మించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేసేదిలేక ఇసుక నియంత్రణ చేయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాయిపల్లి రోడ్డులో అక్రమంగా ఇసుక డంపు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు.
మూడు ఇసుక లారీలు పట్టివేత - ఇసుక లారీలు పట్టివేత
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని రాయిపల్లి రోడ్డులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మూడు ఇసుక లారీలు పట్టివేత
అనంతరం మూడు ఇసుక లారీలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇసుకను అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావటం వల్ల తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. నిందితులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూశాఖ సమన్వయంతో పట్టణంలో ఇసుక మాఫియాను కట్టడి చేస్తామని పేర్కొన్నారు.
ఇవీచూడండి:ఇసుక అక్రమ రవాణాకు చిరునామాగా ఆ జిల్లా