సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఉదయం నుంచి జనతా కర్ఫ్యూలో భాగంగా... ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సంపూర్ణంగా విజయవంతం చేశారు. ఎక్కడ చూసినా.. నిర్మానుష్య రహదారులు, మూసివేసిన దుకాణాలు, హోటళ్లు దర్శనమిచ్చాయి.
పటాన్చెరులో జనతా కర్ఫ్యూ విజయవంతం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో ఇళ్ల ముందుకు వచ్చి ప్రజలు చప్పట్లు కొట్టారు.
పటాన్చెరులో జనతా కర్ఫ్యూ విజయవంతం
సాయంత్రం 5గంటల సమయంలో ఇలా బయటకు వచ్చి, సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞత తెలుపుతూ, ప్రజలు చప్పట్లు కొట్టారు. ఇందులో... చిన్నపిల్లలూ కనిపించారు. అలాగే, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు చరిచారు.
ఇవీ చూడండి:కేసీఆర్ తెచ్చిన 'కరోనా చట్టం'తో ఏం చేయొచ్చో తెలుసా?