సంగారెడ్డిలోని బాలాజీ మంజీర గార్డెన్ ఎదురుగా నివసిస్తున్న మధు నిరంజన్ మొబైల్ డిస్టిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. సుమారు 100 మొబైల్స్‌ను తెచ్చి ఇంట్లో ఉంచి బయటకు వెళ్లాడు. అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. 100 ఫోన్లు తీసుకెళ్లే వీలు లేక 47 ఫోన్లు తీసుకెళ్లారు. నిరంజన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దొంగతనం చేశారు... ప్రమాదానికి గురై చిక్కారు - మొబైల్స్ దొంగలు అరెస్టు
మొబైల్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లిన దొంగలకు..100 ఫోన్లు తారసపడ్డాయి. కానీ మోయడానికి ఇబ్బంది అవుతుందని 47 మొబైల్స్‌ను తీసుకెళ్లారు. వాటిని విక్రయించే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై పోలీసులకు చిక్కిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది.
దొంగతనం చేశారు... ప్రమాదానికి గురై చిక్కారు
కొట్టేసిన వాటిని కొందరికి అమ్మారు. మరికొన్ని అమ్మే క్రమంలో వారు వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. ఆ కేటుగాళ్లను గుర్తించిన పోలీసులు 30 ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పాత నేరస్థులేనని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రమాదంలో ఓ నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
ఇవీచూడండి:ఆ రెండు అంశాల్లో కేసీఆర్ ప్రగతి సాధించారు: జీవన్‌రెడ్డి