సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బచ్చుగూడెం, పోచారం గ్రామాల్లో వ్యవసాయ అధికారులు జలశక్తి అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వర్షపు నీరును ఏవిధంగా ఒడిసి పట్టాలో రైతన్నలకు వ్యవసాయాధికారిని ఉష వివరించారు. ప్రతి ఇంట్లోనూ.. పొలంలోనూ.. ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి.. నీటి సమస్యలను అధిగమించవచ్చునని ఆమె పేర్కొన్నారు.
ఇంకుడు గుంతలు నిర్మిద్దాం నీటి సమస్యలు అధిగమిద్దాం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని బచ్చుగూడెం, పోచారం గ్రామాల్లో వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం జరిగింది. ఇంకుడు గుంతల నిర్మాణాలతోనే నీటి సమస్యలను అధిగమించవచ్చునని గ్రామ ప్రజలకు వారు తెలిపారు.
ఇంకుడు గుంతలు నిర్మిద్దాం నీటి సమస్యలు అధిగమిద్దాం