తెలంగాణ

telangana

ETV Bharat / state

కుండపోత వానతో జహీరాబాద్​ జలదిగ్బంధం

ఎడతెరిపి లేని వర్షంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్​ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. వాహన రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షంతో పలు రకాల పంటలకు ఆస్తి నష్టం వాటిల్లింది.

jahirabad stuck due to continuously heavy rain sangareddy district
కుండపోత వానతో జహీరాబాద్​ జలదిగ్బంధం

By

Published : Oct 14, 2020, 3:53 PM IST

నిన్నటి నుంచి కురిసిన కుండపోత వానతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. జహీరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో హైదరాబాద్- ముంబయి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నీట మునిగిన ఇళ్లు

పట్టణ శివారులోని వసంత్ విహార్, ఇంద్రప్రస్థ కాలనీ, డ్రీమ్ ఇండియా కాలనీ, మూసా నగర్, నేతాజీ నగర్ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అల్గోల్-జహీరాబాద్, బీదర్- జహీరాబాద్ రోడ్లపైకి వరద నీరు చేరడంతో పోలీసుల పర్యవేక్షణలో వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి.

వరదలకి కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టు నిండడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షంతో డివిజన్​లో అల్లం, చెరుకు, అరటి, ఆలూ, సోయా, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరి గర్భగుడి మునిగిపోయింది.

ఇదీ చదవండి:భారీ వర్షానికి... భాగ్యనగరం అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details