ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం కూడలి మీదుగా నిరసన ప్రదర్శన కొనసాగింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. డిపో దుకాణ సముదాయం ఎదుట మహిళా కార్మికులు బైఠాయించి ప్రభుత్వం కార్మిక హక్కుల పరిష్కారానికి కృషి చేయాలని నినదించారు.
29వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల ధర్నా
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజు కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
29వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల ధర్నా