తెలంగాణ

telangana

ETV Bharat / state

గోమాతల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్ భూతం - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం

గోమాతలకు సంరక్షణ కరవై ప్లాస్టిక్ భూతానికి బలవుతున్నాయి. వందల కొద్ది ఆవులు ప్లాస్టిక్​ కవర్లు తింటూ మరణిస్తున్నాయి. గోమాతలు రోడ్లపై తిరుగుతూ ప్లాస్టిక్​నే ఆహారంగా తీసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డిలో అనారోగ్యంతో ఉన్న ఆవుకు శస్త్రచికిత్స చేయగా 80 కిలోల ప్లాస్టిక్​ను వెలికితీశారు.

Cow eats plastic died one cow in sangareddy
గోమాతల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్ భూతం

By

Published : Oct 31, 2020, 10:12 AM IST

సంగారెడ్డి జిల్లాలో ఓ ఆవు కడుపు నుంచి 80కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వైద్యులు తొలగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై తిరుగుతున్న రెండు ఆవులను అధికారులు 20 రోజుల క్రితం అమీన్​పూర్​లోని గోశాలకు తరలించారు. అనారోగ్యంతో సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో ఒక ఆవు మరణించింది.

విషయాన్ని గమనించిన గోశాల నిర్వాహకులు వైద్యులను పిలిచి రెండో ఆవుకు శస్త్రచికిత్స చేశారు. అమీన్​పూర్​ పశువైద్యాధికారి కృష్ణచైతన్య ఏడు గంటలపాటు శ్రమించి 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటికి తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మూగజీవుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు కృష్ణ చైతన్య విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details