తెలంగాణ

telangana

ETV Bharat / state

'అమీన్​పూర్​ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'

ఓ యువకుడితో సినిమాకి వెళ్లింది. ఇంట్లో తెలిస్తే... ఏమంటారో అనే భయంతో కట్టు కథ అల్లింది. తనపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి ఆరా తీస్తే... అసలు నిజం బయటపడింది.

Aminpur rape incident is fake
Aminpur rape incident is fake

By

Published : Jan 24, 2020, 3:21 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో అత్యాచారం ఘటన... బాలిక కల్పించిన కట్టుకథగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి ప్రకటించారు. ఓ యువకుడు ఆ బాలికను ద్విచక్రవాహనంపై సినిమాకి తీసుకెళ్లాడని చెప్పారు. సినిమాకి వెళ్లినట్లు తెలిస్తే... తల్లి తిడుతుందని బాలిక అబద్ధం చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.

అలాగే బాలిక ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేసినందుకు ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మైనర్​ను తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లినందుకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.

'అమీన్పూర్​ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'

సంబంధిత కథనం: అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details