సంగారెడ్డి జిల్లాలో ఓ కరోనా బాధితుడు హల్చల్ చేశాడు. కంగ్టికి చెందిన ఓ వ్యక్తికి రెండు రోజుల క్రితం కరోనా నిర్థరణ అయ్యింది. గత రెండు రోజులుగా గృహ నిర్భంధంలో ఉన్న ఆ వ్యక్తి.. కుటుంబ సభ్యుల కళ్లుగప్పి బయటకి వచ్చాడు.
వీరంగం సృష్టించిన కరోనా బాధితుడు - A corona victim was stabbed in Sangareddy
సంగారెడ్డి జిల్లాలో ఓ కరోనా బాధితుడు వీరంగం సృష్టించాడు. వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
కరోనా బాధితుడు హల్ చల్
మార్కెట్లోకి వెళ్లి అక్కడ ఉన్న వారితో సన్నిహితంగా ఉన్నాడు. కొంతమందిని ముట్టుకున్నాడు. సమాచారం అధికారులకు వెళ్లడంతో.. వైద్య సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అంబులెన్సులో హైదరాబాద్ తరలించారు. మతిస్థిమితం లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కరోనా బాధితుడి వీరంగంతో గ్రామస్థులందరికి కరోనా నిర్థరణ పరీక్షలు చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.
ఇదీ చదవండి:అన్ని వర్గాలకు వైద్యాన్ని అందించడమే లక్ష్యం: విజయారెడ్డి
Last Updated : Apr 9, 2021, 6:30 AM IST