Corona Cases in Gurukul Schools: సంగారెడ్డి జిల్లా గురుకులాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం బీసీ గురుకుల పాఠశాలలో మూడు రోజుల్లోనే 46 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
Corona Cases in Gurukul Schools: మూడు రోజుల్లో 46 మంది విద్యార్థినులకు కరోనా
18:00 December 03
మూడు రోజుల్లో 46 మంది విద్యార్థినులకు కరోనా
నిన్న సుమారు 284 మందికి కరోనా టెస్టులు చేయగా.. 27 మందికి పాజిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి పరీక్షలు చేయగా.. మరో 19 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిని పాఠశాలలోనే ఐసోలేషన్లో ఉంచినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వరుసగా విద్యార్థినులకు కరోనా సోకుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థినులను ఇళ్లకు తీసుకెళ్లిపోతున్నారు.
ముత్తంగిలోనూ..
ముత్తంగి గురుకుల పాఠశాలలోనూ కరోనా కలకలం రేగింది. ఆదివారం (నవంబర్ 28) 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు సోమవారం (నవంబర్ 29) మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 48కి చేరింది. వీరిలో 47 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు.
ఇదీచూడండి:Corona cases in telangana : విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్ నిర్ధరణ