జరిమానాలు మేం వసూలు చేయబోం. మీతో మేమే శిరస్త్రాణం కొనిపించి మీకు పెడతాం అనే నినాదంతో రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను గుర్తించి జరిమానా విధించకుండా వారే స్వయంగా శిరస్త్రాణం పెట్టారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారికి స్లాట్ బుక్ చేస్తున్నామని తెలిపారు.
'జరిమానాలు వేయబోం..హెల్మెట్ కొనిపించి మీకు పెడతాం'
హెల్మెట్ లేదా.. అయితే మేమే మీ డబ్బుతో కొనిపెడతామని అంటున్నారు రాచకొండ పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారుల అదేశాల మేరకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
'జరిమానాలు వేయబోం..హెల్మెట్ కొనిపించి మీకు పెడతాం'