హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన జాయ్ ఆసుపత్రి సహకారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల, ఇక్కారెడ్డిగూడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలకు నాలుగు టీవీలు అందజేశారు. అలాగే చేవెళ్లకు చెందిన పేద విద్యార్థినికి ట్యాబ్ అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ బోధన కోసం టీవీల అందజేత
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన జాయ్ ఆసుపత్రి సహకారంతో నాలుగు టీవీలను అందజేశారు. వీటితో పాటు చేవెళ్లకు చెందిన పేద విద్యార్థినికి ఆన్లైన్ క్లాసుల కోసం ట్యాబ్‌ను అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ బోధన కోసం టీవీల అందజేత
స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ బండారు శైలజ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ క్లాసుల నిర్వహణ కోసం పేద విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకుని సర్కారు బడులకు టీవీలు అందజేయడం గొప్ప విషయమని ఎంపీపీ అభినందించారు.
ఇదీ చదవండిః"కొనలేరు... వినలేరు" కథనానికి స్పందన.. టీవీ అందించిన ఎంపీ రంజిత్