తెలంగాణ

telangana

ETV Bharat / state

వెలుగులీనుతున్న మైలార్​దేవ్​పల్లి రహదారులు - street lights in maheshwaram

రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్ప​ల్లి నుంచి మామిడిపల్లి వరకు విద్యుద్దీపాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. దాదాపు రూ.కోటి 57 లక్షలతో ఈ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

street lights, street lights in rangareddy
వీధి దీపాలు, రంగారెడ్డిలో వీధి దీపాలు

By

Published : Apr 8, 2021, 10:44 AM IST

రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లి నుంచి మామిడిపల్లి వరకు రహదారులన్నీ విద్యుద్దీపాలతో వెలుగులీనుతున్నాయి. దాదాపు రూ. కోటి 57 లక్షలతో విద్యుద్దీపాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్​పల్లి మున్సిపాలిటీ, బడంగ్​పేట్ కార్పొరేషన్, మైలార్​దేవపల్లి డివిజన్​లో వీధి విద్యుద్దీపాలను మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, జల్​పల్లి మున్సిపల్ కమిషన్ జీపీ కుమార్, బడంగ్​పేట్ కార్పొరేటర్లు శివ కుమార్, పవన్ యాదవ్, జల్​పల్లి కౌన్సిలర్లు శంశుద్దీన్, యాదగిరి, లక్ష్మీనారాయణ, మహేశ్వరం నియోజకవర్గ తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details