రంగారెడ్డి కాటేదాన్‌లో కలకలం రేపిన చిరుత ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల ఓ వ్యవసాయ క్షేత్రంలో నక్కిన చిరుత కోసం అటవీ, పోలీసుశాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. చిరుత కోసం 4 ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. బంధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
బోన్లు ఏర్పాటు
వ్యవసాయ పొలం పక్కనే జనావాసాలు ఉన్నందున... ఒకవేళ ఇళ్లల్లోకి వెళితే మనుషులపై దాడి చేసే ప్రమాదముందని భావిస్తున్నారు. పొదల్లో నక్కిన చిరుత... ఆహారం, నీళ్ల కోసం బయటికి రావొచ్చనే అంచనాతో బంధించేందుకు 2 బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా వేశారు. వలలు కూడా ఏర్పాటు చేశారు.
23 కెమెరా ట్రాప్లతో గాలింపు