తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండా సతీమణి సంగీతారెడ్డి ఇంటింటి ప్రచారం - loksabha

చేవెళ్ల పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి తరఫున కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఎంపీగా గెలిపిస్తే చేవెళ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి భార్య ప్రచారం

By

Published : Mar 28, 2019, 6:50 PM IST

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి భార్య ప్రచారం
రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్, బంసిలాల్ పేట్ ప్రాంతాలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున భార్య సంగీతా రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. మొదటగా బుద్వేల్​లోని బాబు జగ్జీవన్​రామ్​ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించారు. విశ్వేశ్వర్ రెడ్డిని చేవెళ్ల ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు. యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నారని.. గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని సంగీతా రెడ్డి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details