Harish on Contract Teachers Regularization: ఈ ఏడాది నుంచి ఎంపిక చేసిన గురుకుల పాఠశాలల్లో ఐఐటి, నీట్ క్లాసులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా నార్సింగి సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలసి నట్టలమందుల్ని మంత్రి పంపణి చేశారు.
త్వరలో సంక్షేమ పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ
Harish on Contract Teachers Regularization: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని ఆర్ధికమంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఒక్క ఉద్యోగం ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన తరువాత సంక్షేమ పాఠశాలల్లో జరిగిన మార్పులను అందరూ గమనించాలని సూచించారు. సన్న బియ్యం, మాంసాహారం, సమయానికి మందులు అందిస్తున్నామని.. అందుకు తగ్గట్లుగా నిధులు పెంచామని హరీశ్ రావు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక్క ఉద్యోగం ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా నార్సింగి సంక్షేమ పాఠశాల ఉందని జిల్లా కలెక్టర్, సిబ్బందిని అభినందించారు.
ఇవీ చదవండి: