ETV Bharat / state
తెరాస పార్టీలో అంతర్గత కలహాలు - GODAVA
తెరాసలో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రావిచేడు గ్రామంలో తెరాస ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కసిరెడ్డిని తెరాస వర్గీయులే అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
తెరాస పార్టీలో అంతర్గత కలహాలు
By
Published : Apr 2, 2019, 1:29 PM IST
| Updated : Apr 2, 2019, 5:31 PM IST
తెరాస పార్టీలో అంతర్గత కలహాలు రంగారెడ్డి జిల్లా రావిచేడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెరాస తరఫున ప్రచారం చేస్తున్నారు. రావిచేడు గ్రామానికి రాగానే ఒక వర్గ ప్రజలు ప్రచారాన్ని అడ్డుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి కాకుండా ఇతర పార్టీలకు మద్దతిచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి... పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు మద్దతిస్తున్నారంటూ గొడవకు దిగారు. ఎమ్మెల్యేల తరఫున ప్రచారం చేయకుండా... ఎంపీల తరఫున చేయడమేంటని నిలదీశారు. కసిరెడ్డి అనుచరులు కల్పించుకోవడం వల్ల ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. Last Updated : Apr 2, 2019, 5:31 PM IST