తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాహితపై సామూహిక అత్యాచారం.. నిందితుల అరెస్ట్‌

Woman Rape Accused Arrested By Police: శనివారం కిడ్నాప్​నకు గురై సామూహిక అత్యాచారానికి గురైన వివాహిత కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో సంబంధమున్న ఇద్దరు నిందితులను 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి బాధితురాలి నుంచి దోచుకున్న బంగారంతో పాటు డబ్బులు, కారు స్వాధీనం చేసుకున్నారు.

woman was raped
మహిళపై అత్యాచారం

By

Published : Feb 19, 2023, 10:36 PM IST

Updated : Feb 20, 2023, 7:52 AM IST

Woman Rape Accused Arrested By Police: హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతంలో వివాహితను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నార్సింగి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 2.5 తులాల పుస్తెల తాడు, రెండు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో పీరం చెరువులోని ఇండస్‌ వ్యాలీ కాలనీ నుంచి బాధితురాలు నివాసానికి నడుచుకుంటూ వెళుతుండగా.. ఇద్దరు నేరస్థులు బాచుపల్లికి చెందిన శుభం శర్మ, సుమిత్‌ కుమార్‌ శర్మ కారుపై వచ్చి చాకు చూపించి బెదిరించారు. అనంతరం ఆమెను కారులో బలవంతంగా ఎక్కించారు. అక్కడి నుంచి కిస్మత్‌పురా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ వద్ద ఉన్న దాదాపు 24 గ్రాముల పుస్తెల తాడు, రెండు సెల్‌ఫోన్లను లాక్కుని పరారయ్యారు.

వెంటనే బాధితురాలు దగ్గరలోనే ఉన్న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా వారు ఎటువైపు వెళ్లారో కనిపెట్టారు. సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలతో 12 గంటల్లోనే పోలీసులు కేసును చేధించి.. నిందితులు ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు.

వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తు మొత్తాన్ని రికవరీ చేసుకోగలిగారు. ఈ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా కనుక్కునే పనిలో పోలీసులు పడ్డారు. సీసీ కెమెరాలోని పుటేజీని ఆధారంగా చేసుకొని నిందితులను జిల్లా మెజిస్ట్రేట్‌లో హాజరుపరిచారు. అనంతరం వారిరువురిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వారిని చట్ట ప్రకారం శిక్షించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన సరే వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 20, 2023, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details