తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదిగో బాండ్​పేపర్​... అభివృద్ధి చేసి చూపిస్తా!

ఎన్నికల్లో నేతలు అది చేస్తాం... ఇది చేస్తాం... అని వాగ్దానాలు చేయడం సాధారణమే. కానీ ఓ స్వతంత్ర అభ్యర్థి తనను గెలిపిస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలను బాండ్​పేపర్​పై​ రాసి ఓటర్లకు అందజేశారు.

muncipal candidate bondpaer given to voters in rangareddy district
ఇదిగో బాండ్​పేపర్​... అభివృద్ధి చేసి చూపిస్తా!

By

Published : Jan 17, 2020, 4:45 PM IST

పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మణికొండ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కస్తూరి విజయ తనను గెలిపిస్తే చేసే పనులను బాండ్ పేపర్​పై రాసి ఓటర్లకు అందచేశారు. తనను గెలిపించి మణికొండ అభివృద్ధికి కృషి చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. న్యాయానికి, నిజాయతీకి ఓటర్లు అధికారం కట్టబెట్టాలని.. ఓటును అమ్ముకోవద్దని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు.

ఇదిగో బాండ్​పేపర్​... అభివృద్ధి చేసి చూపిస్తా!

ABOUT THE AUTHOR

...view details