కష్టకాలంలోనూ ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి నగదు, బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి సబితా - రంగారెడ్డి వార్తలు
రాష్ట్రంలో ప్రైవేటు విద్యాలయాలు పున:ప్రారంభమయ్యేవరకు ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు నగదు, బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
sabitha indra reddy
దేశంలో ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉందని మంత్రి పేరొన్నారు. సుమారు 2,900 మెట్రిక్టన్నుల బియ్యం, రూ.31 కోట్ల వరకు అవసరం అవుతుందని... మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:'ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆర్థిక సాయం పంపిణీ'